సమన్వయంతో ప్రజలకు చేరువ
eenadu telugu news
Published : 28/10/2021 02:19 IST

సమన్వయంతో ప్రజలకు చేరువ

మాట్లాడుతున్న ఎంపీపీ వనజాక్షి

విస్సన్నపేట, న్యూస్‌టుడే: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం తో వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విస్సన్నపేట ఎంపీపీ పిల్లి మెర్సీ వనజాక్షి అన్నారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీగా ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిఫగా హాజరైన ఏఎంసీ చైర్మన్‌ మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన సీఎంఎఫ్‌ఎస్‌ విధానం కారణంగా స్థానిక సంస్థల మనుగడ ప్రశ్నార్థ.కంగా మారిందన్నారు. ఈ విధానం రద్దు చేసేందుకు పంచాయతీ సర్పంచులు, మండల పరిషత్తు ప్రతినిధులు ప్రభుత్వంపై పోరాడినా తప్పులేదని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్‌.వెంకటరమణ, మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు, డీసీసీబీ డైరక్టర్‌ భూక్యా రాణి, విస్సన్నపేట సర్పంచి ఎస్‌.నాగమల్లేశ్వరి, వైకాపా నాయకులు బీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, ఎన్‌.వి.కుటుంబరావు, ఓలేటి దుర్గారావు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని