ప్రాథమిక పాఠశాలను పునః ప్రారంభించరూ!
eenadu telugu news
Published : 28/10/2021 02:19 IST

ప్రాథమిక పాఠశాలను పునః ప్రారంభించరూ!

డీఈవో తాహెరాసుల్తానాకు వినతిపత్రం ఇస్తున్న గ్రామస్థులు

సీతనపల్లి(కృత్తివెన్ను), న్యూస్‌టుడే: కరోనా ప్రభావంతో ఆర్థికంగా కుదేలై ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు కట్టలేకపోతున్నామని, తమ ఊరిలో 2013లో మూసివేసిన ప్రాథమిక పాఠశాలను తిరిగి ప్రారంభించాలని సీతనపల్లి ఎస్సీవాడ వాసులు డీఈవో తాహెరా సుల్తానాకు బుధవారం వినతిపత్రం అందజేశారు. మచిలీపట్నం వెళ్లి డీఈవోను కలిసిన వారు తమ గ్రామంలో పాఠశాల లేకపోవడంతో రెండు కిలోమీటర్లు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. గ్రామంలో 40మంది విద్యార్థులు ఉన్నారని, మూతపడిన పాఠశాలను శ్రమదానంతో శుభ్రపరచుకుంటామని డీఈవోకు తెలిపారు.గ్రామ ఉపసర్పంచి చింతల పద్మ ఆధ్వర్యంలో గ్రామస్థులు, గ్రామపెద్దలు, షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ సంఘం పెడన నియోజకవర్గ అధ్యక్షుడు తోకల మోహనరావు, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి కె.సునీల్‌కుమార్‌, జిల్లా కోశాధికారి కృష్ణకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని