Published : 14/04/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ సాయం అందించాలి

హుజూర్‌నగర్‌లో మాట్లాడుతున్న ప్రైవేటు టీచర్స్‌ ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు గొట్టె నాగరాజు

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి, బోధనేతర సిబ్బందికి, ఆయాలకు, బస్సు డ్రైవర్లకు ప్రభుత్వం ప్రకటించిన సాయం అందించాలని ప్రైవేటు టీచర్స్‌ ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు గొట్టె నాగరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం పట్టణంలో జరిగిన ఆసంఘ సమావేశంలో మాట్లాడారు. అధికారులు ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేసే వారికి రకరకాల కొర్రీలు పెట్టి ప్రభుత్వం అందించే సాయానికి దూరం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డైస్‌ ఫారమ్‌తో సంబంధం లేకుండా సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఈ ఏప్రిల్‌ నుంచి కాకుండా గతేడాది మార్చి నుంచి సాయం అందించాలని ఆయన కోరారు. గత మార్చి నుంచి ప్రైవేటు ఉపాధ్యాయులు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం కూడా లేనిపోని షరతులు పెట్టకుండా అర్హులందరికి సాయం అందించేలా ప్రభుత్వం అధికారులకు తగు సూచనలు చేయాలని ఆయన కోరారు. సమావేశంలో భూపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, రమేశ్‌, శ్రీనివాస్‌, అరుణ, సురేందర్‌రెడ్డి, ప్రకాష్‌, నాజియా, నాగరాజు, వీరస్వామి, హస్సన్‌మియా, విజయ్‌భాస్కర్‌, వెంకటరెడ్డి, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని