Published : 14/04/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండు జిల్లాలను కలిపే రహదారి.. అడుగడుగునా గోతులమయం

గోతులమయంగా మారిన కేఆర్సీపురం- నాయకన్‌గూడెం రహదారి

నడిగూడెం, న్యూస్‌టుడే: సూర్యాపేట- ఖమ్మం జిల్లాలను కలిపే నడిగూడెం నుంచి వయా కాగితరామచంద్రాపురం మీదుగా ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెం వరకు ఉన్న రోడ్లు భవనాల శాఖ రహదారి నరకకూపాన్ని తలపిస్తుంది. కాగితరామచంద్రాపురం నుంచి నాయకన్‌గూడెం మధ్యలో మందడి నర్సయ్య గూడెం గ్రామం వరకు ఉన్న 2 కి.మీ రహదారిని రెండు జిల్లాల అధికారులు పట్టించుకోడం లేదు. గతంలో కేఆర్సీపురం వరకు రహదారి నిర్మించారు. ఖమ్మం జిల్లా అధికారులు నాయకన్‌గూడెం నుంచి మందడి నర్సయ్య గూడెం వరకే రహదారి నిర్మించారు. మధ్యలో ఉన్న రోడ్డును రెండు జిల్లాల అధికారులు పట్టించుకోడం లేదు. దీంతో వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల చినవాగు బ్రిడ్జి వద్ద రహదారిని తవ్వారు. తాత్కాలికంగా మట్టిపోసి చేతులు దులుపుకొన్నారు. జిల్లా పరిధిలోని నడిగూడెం, మునగాల, అనంతగిరి మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు ఖమ్మం జిల్లాకు చేరుకునేందుకు ఈ రహదారి ఉపయోగకంగా ఉంటుంది. ఖమ్మం మిర్చి,పత్తి, నిమ్మకాయల మార్కెట్‌కు రైతులు ఎక్కువగా ఈ మార్గం నుంచే వెళ్తుంటారు. ఏళ్ల తరబడి ఈ రహదారి గురించి అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రెండు జిల్లాలను కలిపే రహదారికి మరమ్మతు పనులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని