Published : 14/04/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీఎస్‌యూటీఎఫ్‌ ఆవిర్భావ వేడుకలు

సూర్యాపేటలో టీఎస్‌యూటీఎఫ్‌ పతకాన్ని ఆవిష్కరిస్తున్న సీహెచ్‌ రాములు

సూర్యాపేట (మహాత్మాగాంధీరోడ్డు): రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టీఎస్‌యూటీఎఫ్‌ కృషి చేస్తుందని ఆ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్‌.రాములు అన్నారు. టీఎస్‌యూటీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యాపేటలో సమాఖ్య పతాకాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ఖాళీగా ఉన్న డీఈవో, డీవైడీఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సమాఖ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.అనిల్‌కుమార్‌, ఎన్‌.సోమయ్య, జె.యాకమల్లు, జి.వెంకటయ్య, వీరారెడ్డి, ఎం.వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని