Published : 14/04/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శివరామక్షేత్ర ఆలయంలో చండీహోమం

మునుగోడు, న్యూస్‌టుడే: ఉగాది పండుగ రోజున శ్రీ ప్రాచీన శివరామక్షేత్ర ఆలయంలో మహా చండీహోమం నిర్వహణ అద్భుతమని, ఇలాంటి గొప్ప సంకల్పంతో నిర్వహించడం వల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటారని సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ, యాదాద్రి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకుడు కారంపుడి నర్సింహాచార్యులు అన్నారు. మునుగోడులోని శ్రీ ప్రాచీన శివరామక్షేత్ర ఆలయంలో మంగళవారం జరిగిన చండీహోమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఒకే దేవాలయంలో శివుడు, రాముడు ఉండటం విశిష్టతగా కొనియాడారు. 15 మంది వేద పండితులతో నిర్వహించిన హోమంలో 30 జంటలు పాల్గొన్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు కొండోజు నవీన్‌కుమార్‌ తెలిపారు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ధూప, దీప నైవేద్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మోహన్‌శర్మ, ఎస్సై రజినీకర్‌, సర్పంచి మిర్యాల వెంకన్న, ఆలయ కమిటీ ఛైర్మన్‌ చెన్నారెడ్డి, బాలసుబ్రహ్మణం పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని