Published : 14/04/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యాదాద్రిలో పంచాంగ శ్రవణం

బాలాలయంలో పంచాంగం ఆవిష్కరణలో ఈవో గీతారెడ్డి, ధర్మకర్త నరసింహమూర్తి

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: శ్రీ లక్ష్మీసమేతులైన నారసింహులు ఒక్కటే అన్నట్లు శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఆదాయం వారిద్దరికి సమానంగా చేకూరనుంది. కొత్త తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ పర్వదినం సందర్భంగా మంగళవారం యాదాద్రిలోని బాలాలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో ఆలయ సిద్ధాంతి, ప్రధాన పురోహితుడు గౌరీభట్ల సత్యనారాయణశర్మ రాశిఫలాలు వివరించారు. నరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి, తుల రాశి. వార్షిక రాబడి రెండు, వ్యయం ఎనిమిది పాళ్లు.. ఇక అమ్మ లక్ష్మీదేవి జన్మనక్షత్రం పుబ్బ, సింహ రాశి. ఆదాయం రెండు, వ్యయం 14 పాళ్లు ఉన్నట్లు సిద్ధాంతి తెలిపారు. కొండపై బాలాలయంలో మంగళవారం ఉగాది వేడుకలను కొవిడ్‌ నిబంధనల మధ్య నిర్వహించారు. ఆలయ మండపంలో జరిగిన పంచాంగ శ్రవణంలో ఆలయ ఈవో గీత, ధర్మకర్త నరసింహమూర్తి దంపతులు పాల్గొన్నారు. ప్రధాన పూజారులు లక్ష్మీనరసింహాచార్య, మోహనచార్య పూజలు చేపట్టారు. అనుబంధ పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఉగాది సందర్భంగా మంగళవారం ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. కల్యాణపర్యాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. పంచాంగం ఆవిష్కరణ, శ్రవణం పర్వాలు జరిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని