Published : 14/04/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలు: సీపీఎం

ఆలేరులో సంప్రదాయ వేషధారణలో సీపీఎం నాయకుల పాదయాత్ర

ఆలేరు, న్యూస్‌టుడే: సమస్యల పరిష్కారానికి రాబోయే రెండు మాసాల్లో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌ అన్నారు. ఆలేరులో మంగళవారం సీపీఎం చేపట్టిన జనచైతన్య యాత్ర సభలో మాట్లాడారు. జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించటంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు విఫలమయ్యారన్నారు. ఆలేరును సస్యశ్యామలం చేయనున్న గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అస్పష్టతను వీడి.. చిత్తశుద్ధి చాటాలని కోరారు. ఎన్నికల సమయంలో హామీలను గుప్పిస్తున్న తెరాస నాయకులు వాటిని పరిష్కారంలో విఫలమవుతున్నారన్నారు. గుత్తేదారులు, నాయకుల కడుపులు నింపేందుకే ప్రభుత్వం అభివృద్ధి పేరిట పనులు చేపడుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నారని విమర్శించారు. అన్ని రెవెన్యూ గ్రామాల పరిధిలో తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. జనచైతన్య యాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 22న జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు కె.నర్సింహ, ఎం.బాలరాజు, మంగ నర్సింహులు, మొరిగాడి రమేష్‌, ఎంఏ.ఎక్బాల్‌, జూకంటి పౌలు, ఎల్గల బాలయ్య, వడ్డెమాన్‌ శ్రీనివాసులు, ధూపటి వెంకటేశ్‌, కాసుల నరేష్‌, చెన్న రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని