Updated : 14/04/2021 03:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెరాస సీనియర్‌ నేత తేరా గోవర్ధన్‌రెడ్డి మృతి

గోవర్ధన్‌రెడ్డి మృతదేహం వద్ద విషాదవదనంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే

రవీంద్రకుమార్‌, తదితరులు

పెద్దఅడిశర్లపల్లి, న్యూస్‌టుడే: తెరాస సీనియర్‌ నాయకుడు, పీఏపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యుడు తేరా గోవర్ధన్‌రెడ్డి(62) సోమవారం రాత్రి మృతిచెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో నెలరోజులుగా చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. 2006 నుంచి 2011 వరకు పీఏపల్లి జడ్పీటీసీ సభ్యుడిగా పదవి నిర్వహించారు. 2014లో అదేస్థానం జనరల్‌ మహిళకు కేటాయింపు జరగడంతో తన కూతురు స్పందనారెడ్డిని బరిలో నిలిపి గెలిపించుకున్నారు. విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐలో రాష్ట్రస్థాయిలో కీలక పదవులతోపాటు పీసీసీ సభ్యుడిగానూ పనిచేశారు. నాటి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడిగా మెలిగిన గోవర్ధన్‌రెడ్ఢి. 2016లో తెరాసలో చేరారు.

మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా నివాళి... పీఏపల్లిలో గోవర్ధన్‌రెడ్డి మృతదేహాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కుందూరు జానారెడ్డి, తదితరులు మంగళవారం వేర్వేరుగా సందర్శించి నివాళులర్పించారు. వీరి వెంట ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ ఉన్నారు. బుధవారం పీఏపల్లిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని