Published : 14/04/2021 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కబడ్డీ క్రీడాకారులకు రూ.60 వేలు సాయం

మఠంపల్లి: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన సూర్యాపేట జిల్లా జట్టుతో

ఓజో ఫౌండేషన్‌ ఛైర్మన్‌ పిల్లుట్ల రఘు 

మఠంపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో వివిధ విభాగాలలో విజేతలుగా నిలిచి జాతీయ స్థాయికి ఎంపికైన సూర్యాపేట జిల్లా జట్టులకు రూ.60వేలు అందజేసి వితరణ చాటుకున్నారు మఠంపల్లి మండలం యాతవాకిళ్లకు చెందిన ఓజో షౌండేషన్‌ ఛైర్మన్‌ పిల్లుట్ల రఘు. షాహిద్‌ భగత్‌సింగ్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 11, 12 తేదీలలో హైదరాబాదులో ఈ పోటీలు జరిగాయి. అండర్‌ 17, అండర్‌ 14బాల, బాలికల విభాగాల్లో ప్రథమ, అండర్‌ 14బాలుర విభాగంలో ద్వితీయ స్థానాలు సాధించుకున్న.వీరంతా 18, 19, 20 తేదీలలో గోవాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో మూడు విభాగాలలో 30మంది పాల్గొనాల్సి ఉంది. పేద కుటుంబాలకు చెందిన ఈ క్రీడాకారులకు ఆర్థిక సాయమందించాలని స్థానిక శిక్షకులు కుక్కల వెంకన్న, మాతంగి మట్టయ్య ఓజో ఫౌండేషన్‌ ఛైర్మన్‌ రఘును కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించి సాయమందించినట్లు వారు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలలోనూ వీరందరికీ భోజన వసతులు  రఘు  కల్పించారన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని