Updated : 14/04/2021 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

భువనగిరి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలను భువనగిరి పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, అదనపు కలెక్టర్లు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాణం ద్వారా దేశానికే ఆయన దిక్సూచిగా నిలిచారన్నారు. రాజ్యాంగంలో ఆయన నిర్దేశించిన హక్కులను సమర్థవంతంగా అమలు చేసి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం వినాయక చౌరస్తాలోని అంబేడ్కర్‌ విగ్రహానికి అదనపు కలెక్టర్లతోపాటు దళిత సంఘాలు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దళిత సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో మహా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, దళిత సంఘాల నేతలు జహంగీర్‌, రామచంద్రయ్య, బండారు రవివర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని