చిన్నారులను ఆదుకోవాలని కేటీఆర్‌కు ట్వీట్‌
logo
Published : 22/07/2021 06:12 IST

చిన్నారులను ఆదుకోవాలని కేటీఆర్‌కు ట్వీట్‌

స్పందించిన మంత్రి

మృతుడు రావుల అయిలయ్య పిల్లలకు నిత్యావసర సరకులు అందజేసిన బాలల హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు

భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌టుడే: భూదాన్‌పోచంపల్లి పురపాలిక కేంద్రంలోని రేవణపల్లిలో ఇటీవల రావుల అయిలయ్య మృతిచెందారు. గతంలో అతని భార్య మరణించారు. తల్లిదండ్రుల మృతితో అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకోవాలని చైతన్య రాష్ట్ర కోఆర్డినేటర్‌ కొత్త శ్రీశైలం బుధవారం రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి అనాథ పిల్లలను ఆదుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతికి ఆదేశించారు. జిల్లా బాలల హక్కుల పరిరక్షణ ప్రతినిధులు రేవణపల్లికి చేరుకొని పిల్లలకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించారు. ప్రతి నెల ఇద్దరు చిన్నారులకు రెండేళ్ల పాటు ఒక్కొక్కరికి నెలకు రూ.2 వేలు చొప్పున అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సుర్కంటి రంగారెడ్డి, సుజాత, రావుల సురేష్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని