శాఖల మధ్య వివాదం.. అంధకారంలో మిర్యాలగూడ
eenadu telugu news
Published : 05/08/2021 20:13 IST

శాఖల మధ్య వివాదం.. అంధకారంలో మిర్యాలగూడ

మిర్యాలగూడ: ప్రభుత్వంలోని రెండు శాఖల సిబ్బంది మధ్య వివాదంతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఆర్టీఏ కార్యాలయంలో విద్యుత్‌ సిబ్బంది ప్రీపెయిడ్‌ మీటర్‌ అమర్చారు. రీఛార్జ్‌ చేయకపోవడంతో ఆర్టీఏ కార్యాలయానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ నిలిపివేతపై ఆర్టీఏ, విద్యుత్‌ శాఖ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విద్యుత్‌ సిబ్బంది వాహనాలకు ఆర్టీఏ అధికారులు జరిమానా విధించారు. అటు ఆర్టీఏ అధికారుల తీరుపై ఆగ్రహించిన విద్యుత్‌ శాఖ సిబ్బంది పట్ణణం మొత్తానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని