వర్మ ‘దిశ’ చిత్రాన్ని నిలిపివేయండి

తాజా వార్తలు

Published : 03/11/2020 01:18 IST

వర్మ ‘దిశ’ చిత్రాన్ని నిలిపివేయండి

న్యాయకమిషన్‌ను ఆశ్రయించిన దోషుల కుటుంబసభ్యులు

హైదరాబాద్‌: ‘దిశ’ అత్యాచార ఘటన నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రాన్ని నిలిపి వేయాలని కోరుతూ ఆ కేసులోని దోషుల కుటుంబ సభ్యులు న్యాయ కమిషన్‌ను ఆశ్రయించారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని ఆపాలని ‘దిశ’ తండ్రి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కల్పించుకుని ఈ సినిమాను వెంటనే నిషేధించాలని కోరారు. తమను సంప్రదించకుండా రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం సరికాదన్నారు. కుమార్తెను కోల్పోయి, ఇప్పటికీ ఎంతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ దిశ కేసులో ఎన్‌కౌంటర్‌కు గురైన శివ, నవీన్‌, చెన్నకేశవులు, ఆరీఫ్‌ కుటుంబ సభ్యులు న్యాయ కమిషన్‌కు విన్నవించారు.

ఈ చిత్రంలో తమ వాళ్లను విలన్‌లుగా పెట్టి చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మ క్షోభించేలా ఈ చిత్రం తీసి తమను ఇంకా చంపుతున్నారని కమిషన్‌ ముందు వాపోయారు. ఓ పక్క న్యాయ కమిషన్‌లో విచారణ కొనసాగుతుంటే ‘దిశ’ కథను ఎలా తెరకెక్కిస్తారని ప్రశ్నించారు. వెంటనే రాంగోపాల్‌ వర్మ తీస్తున్న చిత్రాన్ని నిలిపి వేయాలని కమిషన్‌కు దోషుల కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని