300 టన్నుల సామర్థ్యంతో ఆక్సిజన్‌ ప్లాంట్‌: జగన్‌
close

తాజా వార్తలు

Updated : 13/05/2021 20:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

300 టన్నుల సామర్థ్యంతో ఆక్సిజన్‌ ప్లాంట్‌: జగన్‌

అమరావతి: భవిష్యత్తులో ఆక్సిజన్‌ కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోజువారీ ఆక్సిజన్‌ వినియోగం 600 టన్నులు దాటిందన్నారు. 300 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీని కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘ రాష్ట్రంలో రోగుల అవసరాలను తీర్చేలా ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మించాలి. ప్రతిపాదిత కృష్ణపట్నం, కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఉపయోగపడాలి.అందుకోసం కృష్ణపట్నం లేదా కడపలో మెడికల్‌ ఆక్సిజనే్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై దృష్టి పెట్టాలి’’అని సీఎం అన్నారు.45 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. మొదటి డోసు పూర్తయినవారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రెండో డోసు ఇచ్చిన తర్వాతే మిగిలిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని సూచించారు.

ఏప్రిల్‌ 20 నాటికి రాష్ట్రానికి 360 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయింపు ఉండేదని, ప్రస్తుత వినియోగం 600 మెట్రిక్‌ మెట్రిక్‌ టన్నులకు చేరిందని అధికారులు సీఎం కు వివరించారు. ప్రస్తుతానికి కేటాయింపులు 590 మెట్రిక్‌ టన్నుల వరకూ ఉన్నాయని అన్నారు. ప్రత్యామ్నాయ విధానాల ద్వారా లోటు అధిగమించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వివిధ జిల్లాలకు 8 క్రయోజనిక్‌ ట్యాంకులు పంపిణీ  చేశామన్నారు.  ద్రవ ఆక్సిజన్‌ సరఫరా వాహనాలకు 56 నుంచి 78కి పెంచామని చెప్పారు. కొవిడ్‌ వ్యాక్సిన్ల కోసం గ్లోబల్‌ టెండర్లు పిలిచామని అధికారులు సీఎంకు వివరించారు. 

గ్లోబల్‌ టెండర్లు పిలిచాం: సింఘాల్‌
టీకాల కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్‌ పిలుస్తున్నట్లు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. జూన్‌ 3 వరకు బిడ్ల దాఖలుకు సమయమిచ్చామన్నారు. ఇతర రాష్ట్రాలూ టీకాల కొనుగోళ్లకు ఇదే విధానాన్ని అవలంభిస్తున్నట్లు  సింఘాల్‌ గుర్తు చేశారు. రాష్ట్రానికి ఆక్సిజన్‌ కేటాయింపులు పెంచాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు సింఘాల్‌ వెల్లడించారు. 25 శాతం అదనంగా సిబ్బందిని నియమించాలని కలెక్టర్లకు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని