AP News: టెస్ట్‌ డ్రైవ్‌కు వెళ్తే ... ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ దగ్ధమైంది

తాజా వార్తలు

Published : 16/10/2021 02:19 IST

AP News: టెస్ట్‌ డ్రైవ్‌కు వెళ్తే ... ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ దగ్ధమైంది

చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ దగ్ధమైంది. ఓ వ్యక్తి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై వెళ్తుండగా సాంకేతిక లోపంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో భయాందోళకు గురైన వాహనదారుడు స్కూటర్‌ను అక్కడే వదిలేసి పరుగులు తీశాడు. మంటల్లో స్కూటర్‌ పూర్తిగా కాలిపోయింది. దగ్ధమైన వాహనం విలువ రూ.65వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ఒక షోరూమ్‌కు సంబంధించి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డెమో నిమిత్తం టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని