ట్రూజెట్‌ విమానానికి తప్పిన ప్రమాదం

తాజా వార్తలు

Updated : 16/01/2020 18:01 IST

ట్రూజెట్‌ విమానానికి తప్పిన ప్రమాదం

కడప: కడప నుంచి విజయవాడ వెళ్తున్న ట్రూజెట్‌ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయ్యాక పక్షి తగలడంతో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్‌ అత్యవసర ల్యాండింగ్‌ చేశాడు. ఆ సమయంలో విమానంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో పాటుగా మరో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో విజయవాడ వెళ్లాల్సిన విమానం రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో విమానాశ్రయ అధికారులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని