మహిళలకు ఈస్ట్రోజన్‌ రక్షణ!

తాజా వార్తలు

Updated : 29/08/2020 09:44 IST

మహిళలకు ఈస్ట్రోజన్‌ రక్షణ!

కరోనా తీవ్రత నుంచి కాపాడుతున్న హార్మోన్‌

వాషింగ్టన్‌: మహిళల్లో కరోనా వైరస్‌ తక్కువ ప్రభావం చూపడానికి కారణాలను శోధించిన అమెరికాలోని వేక్‌ ఫారెస్ట్‌ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు కొత్త అంశాలను వెలుగులోకి తెచ్చారు. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ద్వారా మహిళలకు రక్షణ లభిస్తుండొచ్చని తెలిపారు. ‘‘కరోనా వైరస్‌.. గుండెపై ప్రభావం చూపుతుందని ఇప్పటికే తేలింది. ఈస్ట్రోజెన్‌ కారణంగా మహిళలకు గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తున్నట్లు కూడా మనకు తెలుసు. అందువల్ల అతివల్లో ఈ హార్మోన్‌ కారణంగా కరోనా ప్రభావం తక్కువగా ఉంటున్నట్లు అర్థమవుతోంది’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన లీయాన్‌ గ్రోబాన్‌ చెప్పారు. గుండె, రక్త నాళాలు, మూత్రపిండాలు, పేగుల్లోని కణాలపై ఏసీఈ2 అనే గ్రాహకం ఉంటుంది. కరోనా వైరస్‌ సదరు కణంలోకి ప్రవేశించడానికి ఇది వారధిగా పనిచేస్తుంది. గుండెలో ఏసీఈ గ్రాహకాల స్థాయిని తగ్గించడంలో ఈస్ట్రోజెన్‌ పాత్ర పోషిస్తున్నట్లు పరిశోధకులు తాజాగా గుర్తించారు. దీనివల్ల అతివల్లో కొవిడ్‌-19 వ్యాధి లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటున్నట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని