చాటింగ్‌ చేస్తుండగా అడ్డు వచ్చిన భర్త.. పళ్లు రాలగొట్టిన భార్య! 

తాజా వార్తలు

Updated : 26/09/2021 11:18 IST

చాటింగ్‌ చేస్తుండగా అడ్డు వచ్చిన భర్త.. పళ్లు రాలగొట్టిన భార్య! 

చాటింగ్‌ చేస్తుండగా అడ్డు వచ్చిన భర్తపై ఆగ్రహం చెందిన ఓ మహిళ అతడి పళ్లు రాలగొట్టింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని శిమ్లా జిల్లా థియోగ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. థియోగ్‌ సమీపంలోని చైలాచౌకీ ప్రాంతంలో నివసిస్తున్న అమిత్‌ కుమార్‌.. ఎప్పటిలాగానే ఆఫీసు పూర్తయ్యాక ఇంటికి వచ్చారు. ఇంట్లో భార్య చాటింగ్‌లో తీరికలేకుండా ఉండడం చూసి ఎవరితో చాట్‌ చేస్తున్నావ్‌? అని అడిగారు. చాటింగ్‌ మధ్యలో అడ్డువచ్చినందుకు భర్తపై ఆగ్రహం చెందిన ఆమె దాడికి దిగింది. అక్కడే ఉన్న ఓ కర్రతో చితకబాదింది. ఈ క్రమంలో అతని మూడు పళ్లు రాలిపోయాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని