పోలీసుల వలయంలో అంతర్వేది

తాజా వార్తలు

Updated : 09/09/2020 15:05 IST

పోలీసుల వలయంలో అంతర్వేది

అంతర్వేది: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దివ్య రథం దగ్ధమైన ఘటన నేపథ్యంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఇవాళ చలో అంతర్వేదికి భాజపా, జనసేన పిలుపునిచ్చాయి. దీంతో కోనసీమ వ్యాప్తంగా భాజపా, జనసేన నేతలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.

 30 పోలీసు యాక్టు అమలు కారణంగా అంతర్వేదిలో పర్యటించేందుకు నాయకులకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కొత్తపేటలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరు సత్యానందం, రావులపాలెంలో భాజపా గుంటూరుజిల్లా పదాధిపతి రామకృష్ణారెడ్డిలను గృహనిర్బంధం చేశారు. నిన్న చలో అంతర్వేది కార్యక్రమంలో పాల్గొన్న 43 మంది నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతర్వేదిలో పోలీసులు భారీగా మోహరించారు. ఇతర ప్రాంతాల వారు అంతర్వేదిలో అడుగుపెట్టకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇతరులు రావొద్దు: ఏలూరు రేంజ్‌ డీఐజీ

అంతర్వేది పరిసర ప్రాంతాల్లో 30 పోలీసు యాక్టు అమల్లో ఉందని, ఆ  ప్రాంతానికి ఇతరులు రావొద్దని ఏలూరు రేంజ్‌ డీఐజీ తెలిపారు. అంతర్వేది అగ్నిప్రమాద ఘటనాస్థలి వద్ద క్యాంపు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని వెల్లడించారు. ఫోరెన్సిక్‌ విభాగానికి చెందిన నిపుణులు ఘటనాస్థలంలో అణువణువు నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని