ప్రవాసాంధ్రుల పుస్తక స్ఫూర్తి

తాజా వార్తలు

Published : 26/03/2021 23:10 IST

ప్రవాసాంధ్రుల పుస్తక స్ఫూర్తి

లక్షల రూపాయలతో గ్రంథాలయాల ఏర్పాటు

ప్రకాశం: విదేశాలకు వెళ్లారు. ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. అయినా ఇక్కడి జనాన్ని మాత్రం మరవలేదు. విజ్ఞానమే మార్పు తీసుకురాగలదన్న సంకల్పంతో వీధి బడుల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. లక్షల రూపాయలు పోగేసి గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ విద్యార్థులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నివసించే పలువురు ప్రముఖులు ఈ ఆశయ సాధనలో తమవంతు కృషి చేస్తూ విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడుతున్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సామర్థ్యాలు, విశ్లేషణా శక్తిని పెంచేందుకు ప్రవాసాంధ్రులు చేపట్టిన ‘పుస్తకాలతో స్నేహం’ అనే కార్యక్రమం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. సర్కారీ బడుల్లో విద్యార్థులకు వివిధ రకాల సాహిత్యంతో కూడిన పుస్తకాలను ఉచితంగా అందిస్తూ భవిష్యత్తులో వారు ప్రయోజకులుగా ఎదిగేలా తమ వంతు కృషి చేస్తున్నారు. వివిధ దేశాలు, వృత్తుల్లో స్థిరపడిన ప్రకాశం జిల్లాకు చెందిన సుమారు 250 మంది ‘ప్రకాశం గ్లోబల్‌ ఎన్నారై ఫౌండేషన్‌’ అనే సంస్థగా ఏర్పడి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డాక్టర్‌ కొర్రపాటి సుధాకర్‌, సాహితీవేత్త సీఏ ప్రసాద్‌ ప్రవాసాంధ్రుల తరఫున ఈ కార్యక్రమ బాధ్యతలు చేపట్టారు. 

పుస్తకాలు అందజేసిన తర్వాత వాటిని పిల్లలకు అలవాటు చేసేలా రెండు రోజులపాటు వర్క్‌షాప్‌ నిర్వహించి వారితో కథలు చదివించడం, వాటిని నాటకాలుగా ప్రదర్శించడం లాంటి కార్యక్రమాలు చేపడతారు. ప్రకాశం జిల్లాలో మూడేళ్ల నుంచి సుమారు 160 పాఠశాలల్లో పుస్తకాలతో స్నేహం కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయాలు ఏర్పాటుచేశారు. చరిత్ర, సైన్స్‌, సాహిత్యం లాంటి వివిధ అంశాలతో కూడిన పుస్తకాలు అందజేస్తున్నారు. జీవితంలో తాము ఉన్నత స్థానాలకు ఎదగడం సహా పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న ప్రకాశం గ్లోబల్‌ ఎన్నారై ఫౌండేషన్‌ స్థాపకుల ఆదర్శం ప్రశంసలు పొందుతోంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని