సాహో శిల్పా సాహు.. 

తాజా వార్తలు

Published : 21/04/2021 01:44 IST

సాహో శిల్పా సాహు.. 

మండుటెండలో విధులు నిర్వహిస్తున్న గర్భవతి డీఎస్పీపై ప్రశంసలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ మండుటెండలో రోడ్డుపై ఓ గర్భవతిగా ఉన్న డీఎస్పీ విధులు నిర్వహిస్తుండటంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె అంకితభావానికి సలాం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ డివిజన్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన దంతెవాడలో శిల్పా సాహు డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. శిల్పా సాహు ప్రస్తుతం గర్భవతి. కాగా విధుల్లో భాగంగా మాస్కు ధరించి, చేతిలో లాఠీ పట్టుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ.. వాహనదారులు, పాదచారులకు మాస్కు ధరించాలని, కొవిడ్‌ నింబంధనలు పాటించాలంటూ సూచిస్తున్నారు. గర్భవతి అయినప్పటికీ మండుటెండలో రోడ్డు మీద నిలబడి ఆమె విధులు నిర్వహించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మహమ్మారి కట్టడికి పోలీసులు, కరోనా వారియర్ల అంకితభావానికి ఈ వీడియో నిదర్శనమని పేర్కొంటున్నారు.

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా ప్రతిరోజు 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 2,59,170 కేసులు నమోదయ్యాయి. 1761 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇప్పటివరకు మొత్తంగా 1,80,530 మంది మహమ్మారికి బలయ్యారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని