రైల్వేఆస్తుల పరిరక్షణకు నింజా వాహనాలు

తాజా వార్తలు

Published : 19/08/2020 22:20 IST

రైల్వేఆస్తుల పరిరక్షణకు నింజా వాహనాలు

మంబయి: రైల్వే ఆస్తుల పరిరక్షణలో సాంకేతికత దిశగా ఆ శాఖ కీలక అడుగులు వేసింది. మానవ రహిత నింజా వాహనాలను రైల్వే శాఖ కొనుగోలు చేసింది. డ్రోన్ల తరహాలో పని చేసే ఈ వాహనాల ద్వారా రైల్వేశాఖ స్టేషన్‌ పరిసరాలు, పట్టాలు, యార్డులు, వర్క్‌షాప్‌లపై నిఘా ఉంచనుంది. మొదట రెండు నింజా వాహనాలను కొనుగోలు చేసిన రైల్వేశాఖ వీటిని సెంట్రల్‌ రైల్వేలోని ముంబయి డివిజన్‌లో వినియోగించనుంది. ఈ వాహనాల ద్వారా రైల్వే ఆస్తులకు, ప్రయాణికులకు మరింత భద్రత కలగనుందని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ ట్విటర్‌లో తెలిపారు. రైల్వే భద్రత కోసం రైల్వే భద్రత దళం(ఆర్‌పీఎఫ్‌) ఇప్పటికే పలు డివిజన్లలో డ్రోన్లను వినియోగిస్తోంది. రాబోయే కాలంలో మరిన్ని కొనుగోలు చేసి రైల్వే భద్రతను మరింత పటిష్ఠం చేయాలని భావిస్తోంది. రైల్వే పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాల నివారణ, పరిశుభ్రత చర్యలను కూడా దీని ద్వారా పర్యవేక్షించాలని యోచిస్తోంది. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని