బైక్‌ ఎత్తి.. బాహుబలిని గుర్తుచేసి!

తాజా వార్తలు

Updated : 03/03/2021 04:29 IST

బైక్‌ ఎత్తి.. బాహుబలిని గుర్తుచేసి!

సిమ్లా: బాహుబలి సినిమాలో ప్రభాస్‌ శివలింగాన్ని భుజాన ఎత్తుకుంటే హిమాచల్‌ ప్రదేశ్‌లో ఓ యువకుడు ఏకంగా స్కూటీని ఎత్తుకున్నాడు. కుల్లూ జిల్లా రాంశిలాలోని గాయమన్‌ వంతెన వద్ద ఓ యువకుడు స్కూటీని ఎత్తుకొని తీసుకెళుతున్న వీడియో వైరల్‌గా మారింది. సదరు వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వ్యక్తి ఎవరో? స్కూటీని ఎందుకలా ఎత్తుకొని వెళుతున్నాడో స్పష్టతలేకపోయినా.. పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా ఇలా నిరసన వ్యక్తం చేసినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రియల్‌ బాహుబలి అంటూ వీడియోను షేర్‌ చేస్తున్నారు.
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని