ఎనిమిది పదుల వయసులో పీజీ చేసిన విశ్రాంత ఉద్యోగి

తాజా వార్తలు

Published : 12/08/2021 22:28 IST

ఎనిమిది పదుల వయసులో పీజీ చేసిన విశ్రాంత ఉద్యోగి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముడతలు పడిన చర్మం, మసకబారిన కంటిచూపు, మోకాళ్ల నొప్పులతో సహకరించని శరీరం ఇలా అనేక వృద్ధాప్య సమస్యలున్నా ఏ ఒక్కటీ ఆయన సంకల్పానికి అడ్డురాలేదు.  పీజీ పట్టా సాధించాలనే పట్టుదల ముందు ఆ సమస్యలన్నీ చిన్నబోయాయి. కృష్ణారామా అనుకునే 80 ఏళ్ల వయసులో ఉన్నత విద్యావంతుడిగా నిలిచి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కర్నూలు జిల్లాకు చెందిన విశ్రాంత ఉద్యోగి ఎం.సి.పుల్లయ్య. 

నంద్యాల కురవపేటకు చెందిన పుల్లయ్య పీయూసీ పూర్తి చేసి 1961లో  పంచాయతీ సమితిలో చిరుద్యోగిగా చేరారు. 1998లో సూపరింటెండెంట్‌గా  పదవీవిరమణ చేశారు. తోటి మిత్రులంతా ఉన్నత చదువులు పూర్తిచేసిన వారు కావడంతో పుల్లయ్య ఉన్నత విద్యపై దృష్టి సారించారు. డిగ్రీ, పీజీ చేయాలనే లక్ష్యంతో అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం నుంచి 2015లో బి.ఎ. పూర్తి చేశారు. అనారోగ్య సమస్యలు అడ్డంగా నిలిచినా పట్టుదలతో 2021లో ఎమ్‌ఏ సాహిత్యంలో పీజీ పట్టా అందుకున్నారు. చదవాలనే పట్టుదలకు, సాధించాలనే సంకల్పం తోడైతే ఏవయసువారైనా ఉన్నత విద్యను అభ్యసించవచ్చని అంటున్న పుల్లయ్య ఆరోగ్యం సహకరిస్తే పీహెచ్‌డీ కూడా పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని