AP High Court: మా ఆదేశాల అమల్లో జాప్యమెందుకు?: ఏపీ హైకోర్టు

తాజా వార్తలు

Updated : 09/08/2021 14:15 IST

AP High Court: మా ఆదేశాల అమల్లో జాప్యమెందుకు?: ఏపీ హైకోర్టు

అమరావతి: కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణకు నలుగురు ఐఏఎస్‌లు జీకే ద్వివేది, గిరిజాశంకర్‌, శ్రీలక్ష్మి, విజయ్‌కుమార్ హాజరయ్యారు. ఆ పాఠశాలల ఆవరణలో ఎలాంటి భవనాలు నిర్మించొద్దని గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు పాటించలేదని హైకోర్టు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు అమలు చేయడంలో జాప్యమెందుకని ప్రశ్నించింది. తాము ఆదేశించినా నిర్మాణాలు ఎందుకు జరుగుతున్నాయని నిలదీసింది. హైకోర్టు ఆదేశాలను సరిగా పాటించడం లేదని.. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. దీనిపై పూర్తిస్థాయి విచారణను ఈనెలాఖరున విచారిస్తామంటూ విచారణను వాయిదా వేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని