KTR: ఆహ్వానం ఉన్నవారే ప్లీనరీకి రావాలి: కేటీఆర్‌ 

తాజా వార్తలు

Updated : 14/10/2021 16:06 IST

KTR: ఆహ్వానం ఉన్నవారే ప్లీనరీకి రావాలి: కేటీఆర్‌ 

హైదరాబాద్‌: హైటెక్స్‌లో తెరాస ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తెరాస నేతలు, వివిధ విభాగాల అధికారులతో భేటీ అయ్యారు. ఈ నెల 25న జరగనున్న ప్లీనరీ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ నెల 25న తెరాస రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక ఉంటుంది. ప్లీనరీ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సభ ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలపై చర్చించాం.

సభ నిర్వహణ, ఏర్పాట్లు, ఆహ్వాన కమిటీ, వేదిక ప్రాంగణం అలంకరణ, నగర అలంకరణ, ప్రతినిధుల నమోదు, పార్కింగ్‌, భోజన, తీర్మానాలకు పార్టీ తరఫున కమిటీలు పని చేయనున్నాయి. ప్రతినిధులకు పార్టీ తరఫున గుర్తింపు కార్డులు అందిస్తాం. ఆహ్వానం ఉన్నవారే సమావేశానికి రావాలి’’ అని కేటీఆర్‌ తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని