Ap News: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

తాజా వార్తలు

Updated : 14/10/2021 18:13 IST

Ap News: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

తిరుపతి: తిరుమల పర్యటనకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఈరోజు సాయంత్రం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీజేఐకి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో జస్టిస్‌ ఎన్‌వీ రమణ పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు సీజేఐకి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.  అంతకుముందు దిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న జస్టిస్‌ ఎన్‌వీ రమణకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, పలువురు నేతలు, అధికారులు స్వాగతం పలికారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీజేఐ తిరుమల చేరుకున్నారు. ఇవాళ రాత్రికి తిరుమలలో బస చేసి రేపు ఉదయం శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. తిరుమలలో అతిథిగృహం వద్ద తితిదే ఈవో జవహర్‌ రెడ్డి సీజేఐకు స్వాగతం పలికారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని