TS EDCET: తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

తాజా వార్తలు

Published : 24/09/2021 16:46 IST

TS EDCET: తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణలో రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలు విడుదల చేశారు. ఎడ్‌సెట్‌లో 33,683 (98.53 శాతం) మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు చెప్పారు. ఉత్తీర్ణులైన వారిలో 25,983 మంది అమ్మాయిలు ఉన్నట్లు వెల్లడించారు. ఎడ్‌సెట్‌లో నల్గొండ జిల్లాకు చెందిన తిమ్మిశెట్టి మహేందర్‌ మొదటి ర్యాంకు సాధించారు. మంచిర్యాల విద్యార్థిని ఎ.ప్రత్యూషకు రెండో ర్యాంకు, పట్నాకు చెందిన రిషికేశ్ కుమార్ శర్మకు మూడో ర్యాంకు వచ్చినట్లు లింబాద్రి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని