Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 24/07/2021 09:22 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. మీ ఇల్లు మీరే కట్టుకోండి

పండుగల సమయంలో వివిధ కంపెనీలు... ఆఫర్లు ప్రకటిస్తాయి. భారీగా ప్రచారం చేస్తాయి. ప్రచార ప్రకటనల్లో కింద చిన్న అక్షరాలతో ‘షరతులు వర్తిస్తాయి’ అని రాస్తారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రకటించిన మూడు ఆప్షన్లలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. తొలుత మూడింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చని స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం... ఆ తర్వాత మాత్రం మీరే కట్టుకోవాలన్న ఆప్షన్‌వైపే మొగ్గు చూపుతోంది. చాలాచోట్ల అధికారులు ఈ దిశగా లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

విశాఖ రైల్వే జోన్‌ ఎప్పటి నుంచో చెప్పలేం

2. రంగన్న ఏం చెప్పారు?

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన ఇంటి వద్ద కాపలాదారుగా పనిచేసిన భడవాండ్ల రంగన్న అలియాస్‌ రంగయ్య (65) శుక్రవారం న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. సీఆర్‌పీసీ 164 సెక్షన్‌ ప్రకారం జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి బాబా ఫకృద్దీన్‌ దాన్ని నమోదు చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నవమాసాల ఆశలు.. నడిరోడ్డుపై ఆవిరి

సకాలంలో వైద్యసేవలు అందక ఓ మహిళ నడిరోడ్డుపైనే ప్రసవించింది. ఆసుపత్రికి తరలించేలోపే పసికందు ప్రాణాలు విడిచింది. ఆ బాలింత పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దీనిపై స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేవీబీపురం మండలం గోపాలకృష్ణాపురం గిరిజనకాలనీ చెందిన వెంకటయ్య, సుబ్బమ్మ(25)లకు పదేళ్ల కిందట వివాహమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం

4. ఇంటి వద్దే ఆధార్‌తో ఫోన్‌నంబర్‌ అనుసంధానం

సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్‌ కార్డుతో ఫోన్‌నంబరు అనుసంధానం తప్పనిసరి. దీని కోసం చాలా మంది ఇటీవల ఆధార్‌ సీడింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఇకనుంచి ఆధార్‌ కార్డులో ఫోన్‌నంబరు అప్‌డేట్‌ చేయించుకునేందుకు సీడింగ్‌ కేంద్రం వరకు వెళ్లనక్కర్లేదు. పోస్టుమ్యాన్‌కు కబురు పెడితే ఆయనే వచ్చి అవన్నీ మీ ఇంటి వద్దే చేస్తారు. రూ.50 చెల్లించి ఈ సేవలను పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ తపాలా శాఖ జూన్‌ నుంచి ఈ తరహా సేవలను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మరదలి కోసం ఇంకా పోరాడాల్సింది!

క్యాంటీన్‌లో దీర్ఘాలోచనలో ఉన్నా. మల్లెల పరిమళం నా దృష్టిని మరల్చింది. తల తిప్పి చూద్దును.. ఒకమ్మాయి నన్నే సమీస్తోంది. నాకేమో గుండె వేగం పెరగసాగింది. తను నా కళ్లముందుకి వస్తేగానీ తెలియలేదు.. ఆ అమ్మాయి నా మరదలేనని. ‘నువ్వేంటి ఇక్కడ?’ అన్నా ఆశ్చర్యంతో. ‘డిప్లొమా అయిపోయింది. నీది ఇదే కాలేజీ అని తెలిసింది. అందుకే వాలిపోయా బావా’ అంది. నాకోసం వచ్చావా? అంటే కనురెప్పలాడించింది అవునన్నట్టు. ఎప్పుడో స్కూల్‌ డేస్‌లో చూశాను. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

40 దాటిన నవ యవ్వనులు 

6. 14 రైళ్లు రద్దు, మరికొన్ని దారిమళ్లింపు

భారీ వర్షాలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాల మధ్య తిరిగే రైళ్లలో కొన్ని రద్దుకాగా, పలు రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు ద.మ.రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. సెంట్రల్‌ రైల్వేజోన్‌ పరిధిలోని ఇగత్‌పురి-లోనావాలా, కొల్హాపూర్‌-మిరాజ్‌ సెక్షన్ల మధ్య కొండచరియలు విరిగిపడటంతో 14 రైళ్లను రద్దుచేశారు. 24-28తేదీల మధ్య.. నాలుగు రైళ్లు ఒక్కో రోజు, పది రైళ్లు నాలుగు రోజుల చొప్పున రద్దయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Red blood cell: ఆయుర్దాయాన్ని పెంచే ఒమేగా-3

ఎర్ర రక్తకణాల్లో (ఎరిథ్రోసైట్ల)ని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మరణం ముప్పును అంచనావేసే అద్భుత సూచికలని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. రక్తంలో వీటి స్థాయి అధికంగా ఉంటే ఆయుర్దాయం కనీసం ఐదేళ్ల మేర పెరుగుతుందని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆహారంలో చేపలను తీసుకుంటే ఈ ఆమ్లాల స్థాయి పెరుగుతుందని తెలిపారు. నిత్యం ధూమపానం చేసే వ్యక్తి ఆయుర్దాయం 4.7 ఏళ్లు తరిగిపోతుందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రెండు డోసులతో 94% యాంటీబాడీలు

8. జాతీయ రాజకీయాల్లోకి మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర నిర్వహణకు సిద్ధమయ్యారు. టీఎంసీ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు ఆమెను పార్లమెంటరీ పార్టీ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకోవడంతో ఆ దిశగా శుక్రవారం తొలి అడుగుపడింది. ఇంత వరకూ సొంత రాష్ట్ర వ్యవహారాలకే అత్యధిక సమయం కేటాయించిన మమత ఇక తన దృష్టిని దేశ రాజకీయాలపైనా కేంద్రీకరించనున్నారనే విషయం స్పష్టమయ్యింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అవి అశ్లీల చిత్రాలు కావు

పోర్న్‌ చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తాను నిర్మించిన సినిమాలు పోర్న్‌ చిత్రాల కిందకు రావని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందులో పాత్రధారుల వాంఛను వ్యక్తపరిచే సన్నివేశాలే తప్ప, నేరుగా లైంగిక ప్రక్రియను చూపించే దృశ్యాలు లేవని తెలిపారు. కాబట్టి తనను ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67ఏ(అశ్లీల సమాచార ప్రచురణ, ప్రసారం) కింద అరెస్టు చేయడం అక్రమమని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మహిళను పెళ్లి చేసుకోవడానికి హిజ్రాగా మారిన యువతి

10. చివరిది పోయింది

శ్రీలంకతో చివరిదైన మూడో వన్డేలో భారత్‌ 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ చేజిక్కించుకున్న టీమ్‌ఇండియా.. అనేక మార్పులతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగింది. సంజు శాంసన్‌, రాహుల్‌ చాహర్‌, నితీష్‌ రాణా, కృష్ణప్ప గౌతమ్‌, చేతన్‌ సకారియా వన్డే అరంగేట్రం చేశారు. శుక్రవారం టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. తడబడింది. వర్షం వల్ల ఇన్నింగ్స్‌ను 47 ఓవర్లకు కుదించగా.. లంక స్పిన్నర్లు జయవిక్రమ (3/59), అకిల ధనంజయ (3/44) ధాటికి భారత్‌ 43.1 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని