Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 04/10/2021 09:08 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ‘జైకోవ్‌-డీ’ 3 డోసుల టీకా ధర రూ. 1,900!

జైకోవ్‌-డీ కరోనా టీకా ధర విషయమై కేంద్ర ప్రభుత్వం, జైడస్‌ క్యాడిలా కంపెనీ మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 12 ఏళ్లు పైబడిన వారికి వేసే ఈ 3 డోసుల టీకా ధరను జైడస్‌ క్యాడిలా కంపెనీ రూ. 1,900గా ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ధరను తగ్గించేందుకు కేంద్ర చర్చలు జరుపుతోందని.. ఈ వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బడులు తెరవడానికి.. అందాకా ఆగొద్దు!

2. MAA Elections: మెగా ఫ్యామిలీ ‘మా’ ఎన్నికల్లో నిలబడి ఉంటే.. విష్ణుకి నో చెప్పేవాడిని

 చిరంజీవి కుటుంబం నుంచి ఎవరైనా ‘మా’ ఎన్నికల్లో నిలబడి ఉండుంటే తాను మంచు విష్ణుని ఎన్నికల నుంచి విత్‌డ్రా అవ్వమని చెప్పేవాడినని సీనియర్‌ నటుడు మోహన్‌బాబు తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అనేక విషయాలపై స్పందించారు. ముఖ్యంగా ‘మా’ ఎన్నికలపై మాట్లాడారు. తాజా ఎన్నికల్లో విష్ణు విజయం తథ్యమని.. ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేసి ఇచ్చిన మాట ప్రకారం ‘మా’ భవనం కట్టించి తీరతాడని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దసరా బాదుడు

దసరా రద్దీని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు బస్‌ ట్రావెల్స్‌ అప్పుడే సిద్ధమయ్యాయి. ముందస్తుగా టిక్కెట్లు బుక్‌ చేసుకునే వారికి ఛార్జీలను అదనంగా పెంచాయి. ఈ వారాంతం నుంచి విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల దసరా సెలవులు మొదలు కానున్నాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారితో బస్సులు, రైళ్లలో రద్దీ పెరగనుంది. ఇదే అదనుగా దాదాపు అన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ ఛార్జీలను పెంచేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Govt land: సర్కారు భూమిని.. సంతానానికి రాసేసుకున్నాడు

4. IPL 2021: అనుకున్నదానికి భిన్నంగా: మోర్గాన్‌.. 150 పరుగులైతే సరిపోయేది: విలియమ్సన్‌

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మరో అడుగు ముందుకేసింది. ఆదివారం రాత్రి సన్‌రైజర్స్‌పై ఆరో విజయం సాధించి 12 పాయింట్లతో నిలిచింది. దీంతో నాలుగో స్థానానికి మరింత చేరువైంది. అయితే, 116 పరుగులు స్వల్ప లక్ష్య ఛేదనను కూడా ఆ జట్టు చివరి వరకూ తీసుకెళ్లింది. ఈ విషయంపై స్పందించిన కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తాము అనుకున్న దాని కన్నా ఈ వికెట్‌ చాలా నెమ్మదించిందని చెప్పాడు. సహజంగా దుబాయ్‌ పిచ్‌ పవర్‌ప్లేలో స్వింగ్‌ అవుతుందని, కానీ ఈ మ్యాచ్‌లో అలా జరగలేదని అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Azadi Ka Amrut Mahotsav: ఆంగ్లేయ కామాంధులకు అడ్డుపడి...

తెల్లవారి జాతి దురహంకారాన్ని భారతదేశంలో సామాన్యులు సైతం ధైర్యంగా ఎదిరించారు. భారతీయ మహిళల మాన మర్యాదలను కాపాడేందుకు ప్రాణాలనూ పణంగా పెట్టారు. రైల్వే గేటుకీపరుగా పనిచేసిన గూళపాళెం హంపన్న అనే ధీరుడు ఇలాంటి ప్రయత్నంలోనే 128 ఏళ్ల క్రితం ఇదే రోజు అమరుడయ్యారు. ప్రస్తుత అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గూళపాళేనికి చెందిన హంపన్న.. గుంతకల్లు వద్ద రైల్వేగేటు కాపలాదారుగా పనిచేసేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. లడ్డూ బాక్స్‌తో లక్షల ఆదాయం!

అమెరికాలో ఉన్నత చదువు.. మంచి కొలువు. ఇక్కడి యువత కల. డాలర్‌ దేశంలో స్థిరపడాలని ఉవ్విళ్లూరుతుంటారు. కష్ట నష్టాలకు ఓర్చుకుని మరీ స్వప్నం సాకారం చేసుకుంటారు. అయితే అలాంటి అవకాశాన్ని తన కల నేరవేర్చుకోవడానికి కాదనుకున్నారామె. వ్యాపార రంగంలోని ఒడుదొడుకులను తట్టుకుని విజయం దిశగా అడుగులేస్తున్నారు. ఆమే హైదరాబాద్‌కి చెందిన గోపు కవిత.  ఆ వివరాలను వసుంధరతో పంచుకున్నారిలా... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

లైంగిక విద్యపై అవగాహన అందిస్తోంది

7. Pandora Papers: ‘పాండోరా’ దండోరా

ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేస్తూ మరోసారి రహస్య పత్రాలు బహిర్గతమయ్యాయి. ఐదేళ్ల కిందట ‘పనామా పేపర్ల’ పేరుతో పేలిన బాంబు కన్నా శక్తిమంతంగా ‘పాండోరా పేపర్ల’ పేరుతో ఆదివారం రాత్రి ఎంతోమంది ప్రముఖుల బాగోతాలను వెలుగులోకి తెచ్చాయి. తక్కువ పన్ను ఉన్న దేశాలకు పెద్దఎత్తున తరలించిన రహస్య సంపద, అక్రమ పెట్టుబడుల వివరాలు వీటిలో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. శిరస్త్రాణం.. ఉచితం

కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు, 1989లోని 138(4)(ఎఫ్‌) ప్రకారం.. ప్రతి ద్విచక్ర వాహనం అమ్మకం సమయంలో కొనుగోలుదారుకు తయారీదారుల నుంచి తెప్పించి డీలర్లు తప్పనిసరిగా రెండు శిరస్త్రాణాల్ని ఉచితంగా అందించాలి. అవి కచ్చితంగా బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వాహనం తయారీ సమయంలో పాటించే వివిధ భద్రత ప్రమాణాల్లో శిరస్త్రాణాన్నీ పరిగణించాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Crime News: తండ్రి పైశాచికం.. మద్యం తాగించి కూతురిపై అఘాయిత్యం

మార్కాపురం గడియార స్తంభం న్యూస్‌టుడే: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామాంధుడయ్యాడు. కూతురిపైనే అత్యాచారం చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంటికి కన్నకూతురిని తీసుకెళ్లి.. బాలికకు బలవంతంగా మద్యం తాగించి మత్తులో ఉండగా 2రోజులపాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాన్ని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ వీడియో తీయడం పైశాచికత్వానికి పరాకాష్టగా నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇంటర్వ్యూకు వెళుతున్నారా?

మీరో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంది. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ‘ఎలాంటి ప్రశ్నలు వేస్తారో... తెలిసినవి అడుగుతారో లేదో... ప్రశ్నలన్నింటికీ తడబడకుండా సరిగ్గా సమాధానాలు చెప్పగలనో లేదో...’- ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఆందోళన పడుతుంటారు కదా. అలాంటప్పుడు నిపుణులు సూచించే సలహాలు, సూచనలను పాటిస్తే ఫలితం అనుకూలంగా ఉండొచ్చు. అవేమిటో తెలుసుకుందామా..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కఠినంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని