కడుపుబ్బా నవ్వించే పారాగ్లైడింగ్!

తాజా వార్తలు

Updated : 19/03/2021 04:56 IST

కడుపుబ్బా నవ్వించే పారాగ్లైడింగ్!

ఇంటర్నెట్ డెస్క్‌: ఒళ్లు గగుర్పొడిచే అడ్వెంచర్‌ సన్నివేశాలు చూస్తే ఔరా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసే ఇవే సాహసాలు పడిపడి నవ్వేంత హాస్యాన్నీ పుట్టిస్తాయి. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో బ్రహ్మానందం రోలర్‌ కొస్టర్‌ ఎక్కినప్పుడు చేసిన సందడిలా అన్నమాట! సరిగ్గా ఇలానే హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఖజ్జియార్‌లో పారాగ్లైడింగ్‌ చేసిన ఓ మహిళ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. తొలుత ధైర్యంగానే సాహసానికి ప్రయత్నించిన ఆ యువతి.. తీరా గాల్లోకి వెళ్లేసరికి అరుపులు మొదలుపెట్టింది. శిక్షకుడితో ‘వెళ్లొద్దు.. నెమ్మదిగా వెళ్లు’ అంటూ చెప్పడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆమె అరుపుల వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి..Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని