ఈరోజు (17-04-2024)

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆపదలు తొలగడానికి రామరక్షా స్తోత్రం చదివితే మంచిది.

ఈవారం (14-04-2024 - 20-04-2024)

మనోబలంతో  పనిచేసి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు వద్దు. బంధు,మిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంది. కొన్ని కీలకమైన పనులలో పురోగతి ఉంటుంది. స్వస్థానప్రాప్తి ఉంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది.  కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఉంటాయి. ఎవరితోనూ అనవసర ప్రసంగాలు చేయకండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. వారాంతంలో మేలు జరుగుతుంది. ఇష్టదైవ స్తుతి శక్తిని ఇస్తుంది.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని