close

తాజా వార్తలు

Published : 24/10/2020 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పథకాలకు బ్యాంకర్లు అండగా నిలవాలి: జగన్‌

అమరావతి: రుణాలిచ్చే విషయంలో ఉదారత చూపాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బ్యాంకర్లను కోరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 212వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రతి ఒక్కరి సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని.. అన్ని పథకాలను బ్యాంకర్లు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. చిరు వ్యాపారుల కోసం వచ్చేనెలలో జగనన్న తోడు పథకం అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం తెలిపారు. వ్యవసాయం, మహిళల స్వావలంబన, పాఠశాలలు, ఆస్పత్రుల రూపు రేఖల మార్పునకు ప్రాధాన్యమిస్తున్నామని వివరించారు. కొవిడ్‌ సమయంలో నిధులకు కొరత లేకుండా బ్యాంకులు సహకరించాయని జగన్‌ అభినందనలు తెలిపారు. 

ఆర్థిక రంగానికి వ్యవసాయం వెన్నెముకని.. రాష్ట్రంలో దాదాపు 62 శాతం ఆ రంగంపైనే ఆధారపడ్డాయన్నారు. అందుకే రైతు సంక్షేమం, అభివృద్ధికి పలు కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నట్లు సీఎం బ్యాంకర్లకు వివరించారు. ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులు కోరిన 48 గంటల్లోనే వారి ఇంటివద్దకే అందించేలా కియోస్క్‌లను అందుబాటులోకి తెచ్చామన్నారు. గ్రామాల్లో వ్యవసాయ సహాయకుడు, రెవెన్యూ కార్యదర్శి, సర్వేయర్లు, ఈ-క్రాపింగ్‌ చేస్తున్నారని.. ఇది రైతులకు ఎంతో మేలు చేకూరుస్తోందని చెప్పారు. ఈ-క్రాపింగ్‌లో నమోదైన ప్రతి రైతుకు రుణాలు అందుతున్నాయా? లేదా? అన్నది బ్యాంకర్లు చూడాలని సీఎం కోరారు. 2020-21 ఏడాది ఖరీఫ్‌లో రూ.75,237 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు రూ.62,650కోట్లు పంపిణీ చేశారన్నారు. గత ఏడాది కంటే ఇది రూ.3 వేల కోట్లు తక్కువ అని చెప్పారు.

 ప్రతి గ్రామంలో గోదాములు, మండల కేంద్రాల్లో కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయబోతున్నామని, రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కోసం ప్రతి గ్రామంలో జనతా బజార్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాఠశాలలు, ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన కోసం నాడు-నేడు చేపట్టామని.. దానికీ బ్యాంకర్లు సహాయం చేయాలన్నారు. వైఎస్సార్‌ చేయూత ద్వారా దాదాపు 25 లక్షల మహిళలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పూర్తిగా రూ.1100 కోట్ల పారిశ్రామిక రాయితీ అందించినట్లు సీఎం వివరించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నింటికీ బ్యాంకర్ల మద్దతు ఉండాలని, సహాయ సహకారాలు అందించాలని జగన్‌ కోరారు. అనంతరం ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు జి.రాజ్‌కిరణ్‌ రాయ్‌, కన్వీనర్‌ వి.బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలకు పూర్తి అండగా నిలుస్తామని, వ్యవసాయ రంగానికి రుణాలు అందించడంలో నిర్లక్ష్యం చూపబోమని తెలిపారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.