close

తాజా వార్తలు

Published : 05/12/2020 11:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరో దేశంలోనూ ఫైజర్ టీకాకు అనుమతి

మనామా‌: బయోఎన్‌టెక్‌-ఫైజర్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతించిన రెండో దేశంగా బహ్రైన్‌ నిలిచినట్లు ఆ దేశ అధికారిక మీడియా ‘బహ్రైన్‌ న్యూస్‌ ఏజెన్సీ’ ప్రకటించింది. శుక్రవారం ఆ దేశ ‘నేషనల్‌ హెల్త్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ది కింగ్‌డమ్‌ ఆఫ్‌ బహ్రైన్‌’ టీకా వినియోగానికి ఆమోదముద్ర వేసినట్లు తెలిపింది. అంతకుముందు బుధవారం యునైటెడ్‌ కింగ్‌డమం ఫైజర్‌ టీకాను అనమతించిన తొలిదేశంగా నిలిచిన విషయం తెలిసిందే.

ఎన్ని టీకాలు కొనుగోలు చేశారు.. ప్రజలకు ఎప్పటి నుంచి అందజేయనున్నారనే విషయంపై మాత్రం బహ్రైన్‌ స్పందించలేదు. అయితే, టీకా పంపిణీ, నిల్వ బహ్రైన్‌కు సవాల్‌గా నిలవనుంది. ఆ దేశంలో వేసవిలో సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుంటాయి. ఫైజర్‌ టీకాను మాత్రం మైనస్‌ 70 డిగ్రీల వద్ద నిల్వ ఉంచాల్సిన అవసరం ఉంటుంది. అయితే, బహ్రైన్‌కు గల్ఫ్‌ పేరిట ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఉంది. టీకా రవాణాకు దీన్ని ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. బహ్రైన్‌కు దగ్గర్లో ఉన్న దుబాయ్‌లో ఎమిరేట్స్‌ విమానయాన సంస్థ టీకా పంపిణీ, నిల్వ, రవాణాకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది బహ్రైన్‌కు అండగా నిలిచే అవకాశం ఉంది. 

బహ్రైన్‌ ఇప్పటికే చైనాకు చెందిన సినోఫార్మ్‌ టీకాను అత్యవసర వినియోగానికి అనుమతించింది. ఇప్పటి వరకు 6000 మంది ఈ టీకాను తీసుకున్నట్లు సమాచారం. 1.6 మిలియన్‌ జనాభా గల ఈ దేశంలో ఇప్పటి వరకు 87 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరిలో 85 వేల మంది ఇప్పటికే కోలుకొని ఇళ్లకు చేరారు. ఆగ్నేయాసియా దేశాల నుంచి వలస వచ్చే కార్మికులకు బహ్రైన్‌ ఒక కేంద్రంగా ఉంది. జులైలో దాదాపు 8000 మంది వలస కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు ప్రకటించారు.

ఇవీ చదవండి..
టీకా తప్పనిసరేం కాదు: బైడెన్‌

మహమ్మారి ముగింపుపై కలలు కనొచ్చు: WHO


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని