close

తాజా వార్తలు

Published : 24/10/2020 11:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంటర్‌ ప్రవేశాలపై ఆందోళనలో విద్యార్థులు

600 కళాశాలల అనుమతులు నిలిపేసిన ప్రభుత్వం

అమరావతి: ఇంటర్మీడియట్‌.. విద్యార్థి భవిష్యత్తులో ఎంతో కీలకమైన దశ. అందుకే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఇంటర్‌లో చదవాల్సిన కాలేజీ, కోర్సుల ఎంపిక విషయంలో ఎంతో ప్రణాళికతో వ్యవహరిస్తారు. ఈ ఏడాది వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 ఇంటర్మీడియట్‌ కళాశాలల అనుమతుల్ని ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కొన్నింటికి అగ్నిమాపక ధ్రువపత్రాలు లేవని, మరికొన్ని కాలేజీలు వాణిజ్య సముదాయాల్లో ఉన్నాయంటూ అధికారులు అనుమతులు ఇవ్వలేదు. కోరుకున్న కాలేజీలు ఆన్‌లైన్‌లో లేకపోవడంతో తమ పిల్లల్ని చదివించేందుకు ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆన్‌లైన్‌లో కోరుకున్న కళాశాలల జాడలేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కృష్ణాజిల్లాలో ర్యాంకుల కళాశాలల బ్రాంచిలు రెండు మాత్రమే ఉండగా, గుంటూరులో ఒక్కటీ లేదు. గుంటూరులో ఈ ఏడాది 58వేల మంది విద్యార్థులు పదోతరగతి ఉత్తీర్ణులవ్వగా, ఇక్కడ 55వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. కృష్ణాలో 56వేల మంది పదోతరగతి ఉత్తీర్ణులవ్వగా, 65వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఒక పక్క కాలేజీల సంఖ్య తగ్గించిన అధికారులు, మరోపక్క గతంలో సెక్షన్‌కు 88గా ఉన్న సీట్లను ప్రస్తుతం సెక్షన్‌కు 40సీట్లకి కుదించారు. సీట్ల సంఖ్యను తగ్గించినప్పటికీ అదేస్థాయిలో సీట్లను అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ ఉత్తర్వును హైకోర్టు సస్పెండ్‌ చేసినా, ప్రభుత్వం దీనిపై ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా చాలా మంది విద్యార్థులు కాలేజీ ఎంపిక ఐచ్ఛికాలు ఇవ్వకుండా ఎదురుచూస్తున్నారు. 

విద్యార్థులు నీట్‌, ఐఐటీ, నిట్‌, ఎంసెట్‌లలో మంచి ర్యాంకులు వచ్చే కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఇంటర్‌తో పాటు నీట్‌, ఐఐటీ కోచింగ్‌ కోసం ఎక్కువ మంది విద్యార్థులు నగరాలకే ప్రాధాన్యం ఇస్తారు. ఇందుకోసం విజయవాడ, గుంటూరు, విశాఖ, కాకినాడ, తిరుపతి లాంటి నగరాల్లో బోధన బాగుంటుందనే ఉద్దేశంతో ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు కూడా నగరాల్లోని కాలేజీల్లో చేరుతుంటారు. బోధన బాగుండే కళాశాలలు లేకుండా ఇతర కాలేజీల్లో సీట్లు ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని