close

తాజా వార్తలు

Published : 15/08/2020 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించాలి: మోదీ

భారత 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దిల్లీలో ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎర్రకోటపై నుంచి మోదీ ప్రసంగించారు. ‘‘స్వాతంత్ర్య సంగ్రామ ప్రేరణతో దేశం ముందుకు సాగుతోంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్ధమైంది. కరోనా విపత్కర సమయంలోనూ దేశం ఒక్కటై నిలబడింది. 25 ఏళ్లు వచ్చిన ప్రతిబిడ్డ సొంతకాళ్లపై నిలబడాలని కుటుంబం కోరుకుంటోంది. 75 ఏళ్ల తర్వాత కూడా భారత్‌ స్వయం సమృద్ధి సాధించలేకపోయింది. దేశ యువత ఆత్మ విశ్వాసంతో ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
ప్రకృతితో కలిసి జీవిద్దాం

2. సమరవీరులారా..వందనం

అయిదు నెలలుగా స్వైర విహారం చేస్తున్న కరోనాపై వైద్య, పోలీసు, పురపాలక, పారిశుద్ధ్య సిబ్బంది అలుపెరుగక పోరాడుతున్నారు. ఆరోగ్యశాఖలోని అన్ని స్థాయుల అధికారులు, సిబ్బంది కూడా ఇందులో భాగమయ్యారు. తమ సహచరులు ఒక్కొక్కరు వైరస్‌ బారిన పడుతున్నా, అసామాన్య ధైర్యసాహసాలతో ముందుకెళ్తున్నారు. కొవిడ్‌ సోకిన వారు సైతం.. దాన్ని జయించి తిరిగి పోరుబాటలోనే నడుస్తున్నారు. అటువంటి వారిలో మచ్చుకు కొందరి సేవానిరతిని ‘ఈనాడు’ మీ ముందుంచుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అతిపెద్ద కట్టలపాము

అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే ఇది తొలిసారి. ఓ ప్రభుత్వాధికారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.కోటీ పది లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పైగా.. బాధితులెవరూ ఫిర్యాదు చేయకుండానే నేరుగా అనిశా అధికారులే నిఘా పెట్టి నాగరాజ్‌ అనే అతి పెద్ద అవినీతి ‘కట్టల’ పామును ఒడుపుగా పట్టేశారు. నాగరాజ్‌ కీసర తహసీల్దార్‌ కాగా... ఇతడిని నోట్ల కట్టల్లో ముంచేసి భూముల్ని కొట్టేద్దామనుకున్న ఓ ప్రముఖ నేత అనుచరుడిని, మరో దళారిని, వీఆర్‌ఏను ఈ వ్యవహారంలో ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మీరే మీ పిల్లల హీరోలు

పిల్లల మనసులు సున్నితమైనవి. బాల్యంలో ఎదుర్కొనే పరిస్థితులు వాళ్ల భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరిలో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఈ ప్రభావాన్ని ఆ చిన్నారుల హృదయాలపై పడనీయకుండా కాపు కాసే బాధ్యత తల్లిదండ్రులదేనని అంటున్నాడు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌. వాళ్లలో ధైర్యాన్ని నూరిపోసి, కష్టాలను దూరం చేసే హీరోలుగా అమ్మానాన్నలు ఉండాలని సూచిస్తూ రాసిన ఈ వ్యాసం ‘ఈనాడు’కు ప్రత్యేకం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

5. 30లో.. 26మందికి కరోనా నెగెటివ్‌

 ‘స్వర్ణప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదం కేసులో పలు కీలక ఆధారాలను సేకరించాం. మరికొంత సమాచారం, పత్రాలు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత రమేష్‌ ఆసుపత్రి యాజమాన్యం, బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లలో చాలా మంది పరారీలో ఉన్నారు. వీరి కోసం తీవ్రంగా గాలిస్తున్నాం...’ అని విజయవాడ సౌత్‌ ఏసీపీ సూర్యచంద్రరావు వెల్లడించారు. శుక్రవారం ఏసీపీ మీడియాతో మాట్లాడారు. ‘కేసు దర్యాప్తులో భాగంగా 10 మందికి 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశాం. వారిలో ఒకరైన డాక్టర్‌ మమత శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ప్రమాదం జరిగిన రోజు ఈ సెంటర్‌లో మొత్తం 30 మంది బాధితులు ఉండగా.. 26 మందికి కొవిడ్‌ లేదని తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

6. గహ్లోత్‌పైనే విశ్వాసం

రాజస్థాన్‌లో పతనం అంచుల వరకూ వెళ్లిన అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. నెల రోజుల సంక్షోభం సమసిపోయింది. సచిన్‌ పైలట్‌ వర్గ ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్‌పార్టీ గూటికి చేరిన నేపథ్యంలో ఊహించినట్లుగానే శుక్రవారం రాష్ట్ర శాసనసభలో గహ్లోత్‌ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. మంత్రి శాంతి ధరివాల్‌ ప్రతిపాదించిన విశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో సభామోదం పొందింది. మొత్తం 200 మంది సభ్యులుండే సభలో కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్ర సభ్యులు, మిత్రపక్షాలు మద్దతిస్తున్నాయి. భాజపా బలం 72 మంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. ఆన్‌లైన్‌ పందేల వెనక బడా చైనా కంపెనీలు

 ఆన్‌లైన్‌లో పందేలు నిర్వహిస్తూ పట్టుబడిన ముఠా వెనక బడా చైనా కంపెనీల హస్తముందని హైదరాబాద్‌ పోలీసులు వెల్లడించారు.రూ.కోట్లు దండుకున్న బెట్టింగ్‌ కంపెనీల ప్రతినిధి యా హువోను విచారించగా ఈ విషయం బయటపడిందన్నారు. దిల్లీలో ప్రారంభించిన ఇ-కామర్స్‌ సంస్థల వెనక బీజింగ్‌ కేంద్రంగా నడుస్తున్న టీ పవర్‌ సంస్థ ఉందని హైదరాబాద్‌ సంయుక్త కమిషనర్‌ (నేర పరిశోధన) అవినాశ్‌ మహంతి వెల్లడించారు. టీ పవర్‌ కంపెనీని స్థాపించిన చైనీయులు దిల్లీలో దానికి అనుసంధానంగా రెండేళ్ల కిందట డోకీపే, లింక్‌యున్‌ సహా 8 ఇ-కామర్స్‌ సంస్థలను ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. ముకేశ్‌ అంబానీ తర్వాత ఎవరు?​​​​​​​

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కుబేరుడు ముకేశ్‌ అంబానీ. ధీరూభాయ్‌ తదనంతరం ఆస్తి విషయంలో సోదరుల మధ్య నడిచిన వివాదం భారత కార్పొరేట్‌ దృష్టిని అప్పట్లో ఆకర్షించింది. అయితే భవిష్యత్‌లో అలాంటి పరిణామాలు చోటు చేసుకోకూడదని అనుకున్నారో ఏమో.. ముకేశ్‌ అంబానీ తాజాగా ‘ఫ్యామిలీ కౌన్సిల్‌’ ఏర్పాటులో ఉన్నారని తెలుస్తోంది. ఏ వ్యాపార సామ్రాజ్యంలోనైనా వారసత్వ ప్రణాళిక అనేది అత్యంత ముఖ్యమైనది. అందులోనూ అంబానీలాంటి కుబేరుడి విషయంలో మరింత ముఖ్యం. అందుకేనేమో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ ‘కుటుంబ మండలి’(ఫ్యామిలీ కౌన్సిల్‌)ని ఏర్పాటు చేయనున్నట్లు ఒక ఆంగ్ల పత్రికకు విశ్వసనీయ వర్గాలు సమాచారం అందించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. ఐసీయూలో ఎస్పీ బాలు​​​​​​​

సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఐసీయూకి తరలించినట్లు ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 5వ తేదీన స్వల్ప కరోనా లక్షణాలతో ఎస్పీ బాలు ఈ ఆసుపత్రిలో చేరారు. గురువారం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. శుక్రవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో.. ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా లక్షణాలతో 5వ తేదీన ఆస్పత్రిలో చేరారు. ఆ తరవాత ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. అయితే గురువారం రాత్రి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు’ అని ఆ వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

10. 4 బంతుల్లో.. 4 వికెట్లు

భారత సంతతికి చెందిన క్రికెటర్‌ అనురాధ సంచలనం నమోదు చేసింది. జర్మనీ మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ అయిన ఆమె.. శుక్రవారం ఆస్ట్రియాతో జరిగిన టీ20లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి ఆ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. కర్ణాటక మూలాలున్న ఈ అమ్మాయి జర్మనీలో శాస్త్రవేత్తగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే క్రికెట్‌ కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఆమె కర్ణాటక క్రికెట్‌ సంఘం తరపున కూడా గతంలో ఆడింది. ఆస్ట్రియాతో జరిగిన నాలుగో టీ20లో మొదట బ్యాటింగ్‌ చేసిన జర్మనీ 20 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 198 పరుగులు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.