సోషల్‌ మీడియాకు ఆమిర్‌ ఖాన్‌ గుడ్‌బై
close

తాజా వార్తలు

Published : 15/03/2021 22:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ మీడియాకు ఆమిర్‌ ఖాన్‌ గుడ్‌బై

ముంబయి: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. తన 56వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్న మరుసటి రోజే సోషల్‌మీడియాకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. తన పట్ల ప్రేమ, అభిమానాలు చూపిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇదే నా ఆఖరి పోస్ట్‌’ అని పేర్కొంటూ సోషల్‌ మీడియా నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించారు. తన భవిష్యత్‌ ప్రాజెక్టులకు సంబంధించిన అప్‌డేట్స్‌ తన ప్రొడక్షన్‌ బ్యానర్ (akppl_official) అధికారిక ఖాతా ద్వారా వెల్లడిస్తానని వెల్లడించారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని