Allu Arjun: నాన్న కోసం దోశలేసిన అర్హ 
close

తాజా వార్తలు

Published : 05/05/2021 23:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Allu Arjun: నాన్న కోసం దోశలేసిన అర్హ 

వీడియో షేర్‌ చేసి మురిసిపోయిన బన్నీ

హైదరాబాద్‌: సినిమా షూటింగ్స్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే అల్లు అర్జున్‌ ఇటీవల కొవిడ్‌ బారినపడడంతో గత కొన్నిరోజుల నుంచి ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో ఆయన తన చిన్నారులతో కలిసి అపురూప క్షణాలను ఆస్వాదిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూనే చిన్నారులు చేస్తున్న ముద్దు ముద్దు పనులు చూసి ఆయన మురిసిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్‌కి ఆయన గారాలపట్టీ అర్హ స్పెషల్‌ దోశలు వేసి పెట్టింది.  ఉదయాన్నే వంటగదిలోకి అడుగుపెట్టిన అర్హ తన చిట్టి చేతులతో నాన్నకు దోశ వేసింది. దీనికి సంబంధించిన వీడియోని ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసిన బన్నీ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘అల.. వైకుంఠపురములో’చిత్రంలో  ‘రాములో రాములా’పాట కోసం తాను వేసిన స్టెప్పుని స్ఫూర్తిగా తీసుకుని అర్హ ఇలా దోశలు వేసి ఉంటుందని బన్నీ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అర్హ వేసిన దోశ ఫొటో షేర్‌ చేసిన ఆయన.. దీనిని తాను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది విడుదలైన ‘అల.. వైకుంఠపురములో’ విజయం తర్వాత బన్నీ నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో బన్నీ.. పుష్పరాజ్‌గా ఊరమాస్‌ గెటప్‌లో కనిపించనున్నారు. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని