Allu Arjun: కరోనా నుంచి కోలుకుంటున్నా
close

తాజా వార్తలు

Updated : 03/05/2021 17:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Allu Arjun: కరోనా నుంచి కోలుకుంటున్నా

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను కరోనా నుంచి కోలుకుంటున్నానని ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్‌ అన్నారు. సోషల్‌ మీడియా వేదికగా తన అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘అందరికీ నమస్తే.. ఇంకా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. నేను క్షేమంగానే ఉన్నాను. వేగంగా కోలుకుంటున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు’ అని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. గత బుధవారం బన్నికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఇదిలా ఉండగా.. కరోనా కారణంగా ప్రస్తుతం బన్ని హీరోగా నటిస్తున్న ‘పుష్ప’ చిత్రీకరణ వాయిదా పడింది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బన్ని సరసన రష్మిక హీరోయిన్‌గా సందడి చేయనుంది. మలయాళ స్టార్‌ ఫాహద్‌ ఫాజిల్‌ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించారు. ‘ఆర్య’, ‘ఆర్య2’ చిత్రాల తర్వాత సుకుమార్‌-బన్ని కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని