క్రైమ్‌ థ్రిల్లర్‌ కథలో ఆనంద్ దేవరకొండ
close

తాజా వార్తలు

Published : 06/05/2021 20:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రైమ్‌ థ్రిల్లర్‌ కథలో ఆనంద్ దేవరకొండ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా ‘హైవే’ అనే చిత్రం ఖరారైంది. కె.వి. గుహన్‌ దర్శకుడు. గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది ఈ సినిమా. తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు గాదరి కిశోర్‌ కుమార్‌ క్లాప్‌ నివ్వగా.. దర్శకుడు వీరభద్రం కెమెరా స్విచ్చాన్‌ చేశారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్‌ పతాకంపై వెంకట్‌ తలారి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సిమన్‌ కె.కింగ్‌ సంగీతం అందిస్తున్నారు. నాయిక వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం ‘పుష్పక విమానం’ చిత్రంలో నటిస్తున్నాడు ఆనంద్‌. సినిమాటోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గుహన్‌ దర్శకుడిగా మారి తెలుగులో ‘118’ , ‘WWW’ చిత్రాలు తెరకెక్కించారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని