అను.. కరోనా వేళ ఈ ఫొటోలు ఏంటమ్మా
close

తాజా వార్తలు

Published : 23/04/2021 15:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అను.. కరోనా వేళ ఈ ఫొటోలు ఏంటమ్మా

హైదరాబాద్‌: తన ఫొటోషూట్‌ గురించి కామెంట్‌ చేసిన ఓ నెటిజన్‌కు మాటలతో చురకలు అంటించింది నటి అనసూయ. స్టైలిష్‌ యాంకర్‌గా బుల్లితెరపై ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన అనసూయ ప్రస్తుతం పలు షోలు, సినిమాల షూటింగ్స్‌తో బిజీ షెడ్యూల్‌ గడుపుతున్నారు. తాజాగా ఆమె ఓ షూట్‌ కోసం గౌను ధరించి ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లతో తన ఫొటోలు పంచుకున్నారు.

కాగా పలువురు నెటిజన్లు ఆమె వస్త్రాధారణ గురించి నెగెటివ్‌ కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్‌.. ‘ఇలాంటి ఫొటోలు పోస్ట్‌ చేయడానికంటే ముందు.. దేశంలో కరోనా కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి కదా దాని గురించి మీకస్సలు బాధ లేదా? నా ఉద్దేశం ఏమిటంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ ఫొటోలు అవసరమా?’ అని కామెంట్‌ పెట్టారు. నెటిజన్‌ కామెంట్‌పై స్పందించిన అను..‘ఇలాంటి కఠిన సమయాల్లో కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌, నమ్మకాన్ని కొంతవరకూ అయినా మేము అందిస్తున్నాం. నువ్వు పాజిటివ్‌ కోణంలో ఆలోచించలేవా’ అని కౌంటర్‌ ఇచ్చింది. మరోవైపు ఆమె ప్రస్తుతం ‘ఖిలాడి’, ‘పుష్ప’ చిత్రాలతోపాటు కోలీవుడ్‌లోనూ ఓ సినిమాలో నటిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని