Anasuya: సుకుమార్‌ సర్‌.. కృతజ్ఞతలు
close

తాజా వార్తలు

Published : 06/05/2021 22:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anasuya: సుకుమార్‌ సర్‌.. కృతజ్ఞతలు

హైదరాబాద్‌: తనపై నమ్మకం ఉంచినందుకు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌కు నటి అనసూయ కృతజ్ఞతలు తెలిపారు. బుల్లితెర వ్యాఖ్యాతగా చేరువైన అనసూయ అనతికాలంలోనే ‘రంగస్థలం’తో రంగమ్మత్తగా ఎంతోమంది ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థ్యాంక్యూ బ్రదర్‌’ త్వరలో ఈ సినిమా ‘ఆహా’ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అనసూయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘థ్యాంక్యూ బ్రదర్‌’ లాంటి విభిన్న కథా చిత్రంలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. అనంతరం ‘పుష్ప’లో భాగం కావడం గురించి మాట్లాడుతూ..

‘‘ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన ‘రంగస్థలం’ చిత్రంలోని రంగమ్మత్త పాత్ర నాకెంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర ఎంతోమందికి నచ్చింది. కాగా, ఇప్పుడు మరలా ఆయన తెరకెక్కిస్తున్న ‘పుష్ప’లో సైతం నాకు ఓ మంచి పాత్ర దక్కింది. ఈ సినిమాలో నా పాత్ర గురించి ఇప్పుడే బయటకు చెప్పలేను. రంగమ్మత్త ఎంతలా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిందే అదేమాదిరిగా ఈ పాత్ర సైతం ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటుంది. నాపై నమ్మకం ఉంచి ఇలాంటి మంచి పాత్రల్లో అవకాశం కల్పించిన సుకుమార్‌ సర్‌కి కృతజ్ఞతలు’ అని అనసూయ తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని