నాకే అంత వస్తే.. ఎవ్వరినీ సాయమడగను
close

తాజా వార్తలు

Published : 17/04/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాకే అంత వస్తే.. ఎవ్వరినీ సాయమడగను

బాలీవుడ్‌ హీరో అర్జున్‌కపూర్‌

ముంబయి: తనపై లేదా తన లైఫ్‌స్టైల్‌పై ఎవరైనా నెటిజన్లు కామెంట్లు చేస్తే.. అలాంటి వారికి ఘాటుగా సమాధానమిచ్చేవాళ్లలో బాలీవుడ్‌ హీరో అర్జున్‌కపూర్‌ ఒకరు. తన లైఫ్‌స్టైల్‌ గురించి ట్రోల్‌ చేసిన వారికి  ఆయన ఇప్పటికే పలు సందర్భాల్లో కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా అర్జున్‌కపూర్‌ ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ తనకే కనుక కోట్లలో పారితోషికం వస్తే తాను ఎవ్వరినీ సాయం కోరనని అన్నారు.

తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న ఓ చిన్నారికి సాయం చేయమని కోరుతూ తాజాగా అర్జున్‌కపూర్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ఆ చిన్నారి వైద్యానికి సుమారు రూ.16 కోట్లు ఖర్చు అవుతుందని.. చేతనైనంత సాయం చేయాలని కోరారు. కాగా, అర్జున్‌ పెట్టిన పోస్ట్‌పై స్పందించిన ఓ నెటిజన్‌.. ‘మీ రోజువారీ సంపాదన కనుక అందిస్తే ఆ చిన్నారికి సరైన చికిత్స చేయించవచ్చు’ అని కామెంట్‌ పెట్టింది. ఆ కామెంట్‌పై ఆగ్రహానికిలోనైన అర్జున్‌.. ‘ఒకవేళ నాకే కనుక రోజుకి రూ.16 కోట్ల సంపాదన ఉండి ఉంటే.. సాయం కోరుతూ ఈ పోస్ట్‌ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. అంతపెద్ద మొత్తాన్ని నేను అందించలేను కాబట్టే నా వంతు సాయం అందించి.. ఆ చిన్నారికి సాయం చేయమని అందర్నీ అడుగుతున్నాను’ అని సమాధానమిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని