నాగబాబు వాట్సాప్‌ డీపీలో బాలయ్య..!
close

తాజా వార్తలు

Published : 15/04/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగబాబు వాట్సాప్‌ డీపీలో బాలయ్య..!

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, నందమూరి బాలకృష్ణ నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఓ ఫొటోని తన వాట్సాప్‌ డీపీగా పెట్టుకున్నట్లు నటుడు నాగబాబు తెలిపారు. గత కొన్నిరోజుల నుంచి ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో ముచ్చటిస్తున్న నాగబాబు తాజాగా మరోసారి ‘Ask Me A Question’ పేరుతో సరదా సంగతులు పంచుకున్నారు.

ఇందులో భాగంగా ఓ నెటిజన్‌.. ‘మీది ప్రేమ వివాహామా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా?’ అని ప్రశ్నించగా.. తనని పెద్దలు కుదిర్చిన వివాహమని ఆయన తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానంగా న్యూజిలాండ్‌ తనకెంతో ఇష్టమైన ప్రదేశమని అన్నారు. అనంతరం అల్లు అర్జున్‌ గురించి స్పందిస్తూ.. తన వరకూ బన్నీకి స్టైలిష్‌స్టార్‌ ట్యాగ్‌ బాగుంటుందన్నారు. అలాగే, సాయిధరమ్‌ తేజ్‌.. అమాయకుడు, కష్టపడే గుణం కలిగిన వ్యక్తి అని నాగబాబు సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా ఓ నెటిజన్‌.. ‘మీ వాట్సాప్‌ డీపీ ఏమిటి?’ అని ప్రశ్నించగా.. రామ్‌గోపాల్‌వర్మ, బాలకృష్ణ కలిసి దిగిన ఓ ఫొటోని షేర్‌ చేశారు. అయితే, గతంలో ఓ సందర్భంలో నాగబాబు.. బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో నాగబాబు.. తన వాట్సాప్‌ డీపీ గురించి వ్యంగ్యంగా సమాధానమిచ్చారా? లేక నిజమే చెప్పారా అని అందరూ చెప్పుకుంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని