బ్రహ్మీ మీమ్స్‌తో నగర పోలీస్‌ స్పెషల్‌ వీడియో
close

తాజా వార్తలు

Published : 04/03/2021 11:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్రహ్మీ మీమ్స్‌తో నగర పోలీస్‌ స్పెషల్‌ వీడియో

హైదరాబాద్‌: సమాజంలో జరుగుతోన్న మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగర పోలీస్‌ శాఖ పలు ప్రత్యేక పద్ధతులు అనుసరిస్తోంది. ఫొటోలు, వీడియోలతో తరచూ ప్రజల్ని అప్రమత్తం చేసిన హైదరాబాద్‌ నగర పోలీస్‌ శాఖ తాజాగా ఓ స్పెషల్‌ వీడియోతో అందర్నీ ఆకర్షిస్తోంది. ఆన్‌లైన్‌ వేదికగా ఉద్యోగాల పేరుతో జరుగుతోన్న మోసాల వలలో చిక్కుకుని, చివరికి ఆ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్న ఘటనలను ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. అలాంటి మోసాల పట్ల ప్రతిఒక్కరికీ అవగాహన కల్పిస్తూ.. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం నటించిన పలు చిత్రాల్లోని కామెడీ సీన్స్‌తో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ విభాగం ఓ ప్రత్యేక వీడియోని రూపొందించింది. తాజాగా ఆ వీడియోని ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది. ఉద్యోగాల పేరుతో జరుగుతోన్న మోసాల గురించి ఆ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో అందర్నీ ఆకర్షిస్తోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని