క్లిక్‌ చేస్తే బూట్లు ఫ్రీ... నమ్మొద్దు ప్లీజ్‌
close

తాజా వార్తలు

Published : 06/03/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్లిక్‌ చేస్తే బూట్లు ఫ్రీ... నమ్మొద్దు ప్లీజ్‌

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఫేక్‌ లింకులు

ఇంటర్నెట్ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫేక్‌ లింకులు చాలా ప్రమాదకరంగా పరిణమిస్తాయి. పొరపాటున క్లిక్‌ చేస్తే చాలు.. ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లే. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం దగ్గర పడుతున్న వేళ వాట్సాప్‌లో ఒక ఫేక్‌ లింక్‌ చక్కర్లు కొడుతోంది. ‘ఓ ప్రముఖ బ్రాండ్‌కు చెందిన బూట్లను మహిళా దినోత్సవం సందర్భంగా ఉచితంగా పొందండి’ అన్నది ఆ లింక్‌ సారాంశం. ఆకర్షణీయంగా ఉన్న దాన్ని చూడగానే అందరూ ఆసక్తిగా ఆ లింక్‌ను క్లిక్‌ చేస్తారు. అంతే హ్యాకర్ల చేతికి మనం తాళాలిచ్చినట్లే.. కాబట్టి ఇటువంటి ఫేక్‌ లింకులపై యూజర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి.

ఆ లింక్‌ ఇదే... 

 

సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ఫేక్‌ లింకులు చక్కర్లు కొట్టడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకు ముందు వందల సంఖ్యలో లింకులు లక్షల మంది యూజర్లను మాయలో పడేశాయి. తాజాగా వచ్చిన లింక్‌ లాగా ఉచితంగా అవీ ఇవీ ఇస్తామని ఏ సంస్థా ఈ విధంగా ప్రకటించదు. వారు ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తే వారి అధికారిక వెబ్‌సైట్లో కానీ, సామాజిక మాధ్యమాల్లోని వారి అధికారిక ఖాతా నుంచి గానీ ప్రకటిస్తాయి. అలాంటివేమీ లేకపోతే ఇటువంటి ఫేక్‌ లింకుల జోలికి పోకుండా ఉండటం ఉత్తమం.

వాట్సాప్‌ను సురక్షితంగా ఎలా వాడాలంటే..?

* అనుమానాస్పదంగా ఉన్న లింకులపై క్లిక్‌ చేయకూడదు. * ఉచితంగా ఆఫర్లు ప్రకటిస్తూ వచ్చే మెస్సేజ్‌లను నమ్మకూడదు. * మీకు వచ్చిన యూఆర్‌ఎల్‌ లింకును నిశితంగా పరిశీలించాలి. యూఆర్‌ఎల్‌లో చిన్న స్పెల్లింగ్‌ మార్పులతో బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని