త్వరలో బౌన్స్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 
close

తాజా వార్తలు

Updated : 01/03/2021 17:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలో బౌన్స్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రోజురోజుకి పెరిగిపోతోన్న తరుణంలో కొనుగోలదారుల దృష్టి  ఎలక్ట్రిక్ వాహనాలపై పడుతోంది. ఇప్పటికే దేశంలో యూలు, వోగోలు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు తయారు చేస్తున్నాయి. అయితే అద్దెకు బైక్‌లను ఇచ్చే బౌన్స్ కంపెనీ ‘బౌన్స్‌-ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌’ను ఇండియాలో త్వరలోనే ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు వివేకానంద హెల్లెకెరె ట్విటర్‌ ద్వారా వివరాలు వెల్లడించారు. 


‘బౌన్స్‌-ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌’కు సంబంధించి గత సెప్టెంబర్‌లో ఐసీఏటీ నుంచి అధికార ధ్రువీకరణ పత్రం అందుకున్న తొలి కంపెనీ మాదే అని సీఈవో హెల్లెకెరె తెలిపారు. ఇండియాలో కూడా ఇదే ధ్రువపత్రం తీసుకున్న తొలి బైక్‌ షేరింగ్‌ కంపెనీ తమదేనన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా బౌన్స్‌ ఆప్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లను అద్దెకు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. బౌన్స్ కంపెనీ ప్రస్తుతం బెంగళూరు, హుబ్లీ, విజయవాడ, మైసూర్‌లలో ద్విచక్రవాహనాలను అద్దెకు ఇస్తోంది. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లను ప్రస్తుతం బెంగళూరు, మైసూరులలో టెస్టింగ్‌ చేస్తున్నట్లు హెల్లెకెరె తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లాజిస్టిక్స్‌, డెలివరీ కంపెనీలకు అమ్మేందుకు కృషి చేస్తున్నట్లు గతంలోనే హెల్లెకెరె తెలిపారు. 

ఇక ధర విషయానికి వస్తే ఇండియాలో రూ.55,000 నిర్ణయించనున్నట్లు సమాచారం. బ్యాటరీ మార్పిడి, నిర్వహణ ఖర్చుల కోసం వినియోగదారుడు అధనంగా మరో రూ.1,450 భరించవలసి ఉంటుంది. ఇక ‘ఎలక్ట్రిక్‌ స్కూటర్‌’ పసుపు, నలుపు రంగుల్లో లభించనుంది. రెండు హెల్మెట్లు భద్రపరుచుకోవడానికి వెసులుబాటు ఉంది. ఒకసారి ఛార్జి చేస్తే 65 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని