
తాజా వార్తలు
సుకుమార్ ఫ్యామిలీ ఫంక్షన్లో తారల సందడి
వైరల్‌గా మారిన ఫొటోలు, వీడియోలు
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుటుంబంలో జరిగిన ఓ శుభకార్యానికి తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు హాజరై సందడి చేశారు. సుకుమార్ కుమార్తె సుకృతి వేణి వోణీల కార్యక్రమం బుధవారం సాయంత్రం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో మహేశ్‌బాబు-నమ్రత, ఎన్టీఆర్-ప్రణతీ, నాగచైతన్య-సమంత దంపతులతోపాటు కృతిశెట్టి, రామ్, సాయిధరమ్‌తేజ్, వైష్ణవ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్, కీర్తిసురేశ్ తదితరులు పాల్గొన్నారు. సుకృతిని ఆశీర్వదించి.. సుకుమార్‌తో సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
ఇవీ చదవండి
Tags :