Corona..సుహాసిని, మాధవన్‌ ఏమన్నారంటే 
close

తాజా వార్తలు

Published : 06/05/2021 01:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona..సుహాసిని, మాధవన్‌ ఏమన్నారంటే 

వీడియో షేర్‌ చేసిన తారలు

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోన్న విషయం తెలిసిందే.  కొవిడ్‌ కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో క్లిష్టపరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కొవిడ్‌ వైరస్‌ తీవ్రతను ఎదుర్కొనేందుకు ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కోరుతూ కోలీవుడ్‌ సెలబ్రిటీలు ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మద్రాస్‌ వారు రూపొందించిన ఓ వీడియోలో సుహాసిని, మాధవన్‌, అరవింద్‌ స్వామి, నాజర్‌, రాధిక, తదితరులు భాగమయ్యారు.

‘ఇది క్లిష్టమైన సమయం.. వైరస్‌ వ్యాప్తి చెందకుండా చేయాల్సిన సమయమిది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌  అతివేగంగా  విస్తరిస్తోంది. మనకి మనమే వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలి. చిన్న పొరపాటుకు సైతం పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్‌ ధరించండి. సామాజిక దూరం పాటించండి. తరచూ చేతులు శుభ్రం చేసుకోండి. అలాగే ఈ పరిస్థితుల్లోనూ మనకి కొంతమేర ఊరటనిస్తున్న విషయమేమిటంటే కొవిడ్‌ వ్యాక్సిన్‌. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోండి. కరోనా వ్యాక్సిన్‌ మన కోసం.  మన భద్రత కోసం. వ్యాక్సిన్‌ సురక్షితమైనదని గుర్తించండి. కరోనాతో పోరాటం చేద్దాం. కరోనాని నిర్మూలిద్దాం’ అని వాళ్లు పేర్కొన్నారు. మరోవైపు మంచు లక్ష్మి సైతం ప్రతిఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, సురక్షితంగా జీవించాలని కోరారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని